Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా ఒకరోజే 2,95,041 కేసులు
- మహారాష్ట్రలో నేటి నుంచి లాక్డౌన్
న్యూఢిల్లీ: డేంజర్ జోన్లోకి భారత్ ఎంటరైంది. మరేదేశంలోనూ నమోదుకాని రీతిలో నిత్యం కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదవున్నాయి. ఒక్కరోజే ఏకంగా దాదాపు మూడు లక్షల కొత్త కేసులు నమోదు, రెండు వేలకు పైగా మరణాలు చోటుచేసుకోవడం భారత్‌లో వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది.
తాజాగా బుధవారం ఉదయం కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,95,041 కరోనా కేసులు, 2,023 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,56,16,130 చేరగా, మరణాలు 1,82,553కు పెరిగాయి. ప్రస్తుతం 21,57,538 యాక్టివ్ కేసులున్నాయి. 1,32,76,039 మంది కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకు భారత్‌లో 27,10,53,392 కరోనా పరీక్షలు చేయగా, మంగళ వారం ఒక్కరోజే 16,39,357 శాంపిళ్లను పరీక్షిం చారు. అలాగే, 13 కోట్ల మందికి టీకాలు అందిం చారు. పాట్నాలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) లో 384 మంది వైద్య సిబ్బందికి కరోనా వచ్చింది.
ఇందులో డాక్టర్లతో పాటు ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హౌం క్వారంటైన్లో ఉన్నారు. బెంగాల్‌కు చెందిన ప్రముఖ కవి శంఖ ఘోష్ కరోనాతో పోరాడుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్ర, పుదుచ్చేరిలో లాక్డౌన్..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయనున్నట్టు ఆ ప్రభుత్వాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూతో పాటు వారాంతపు కర్ఫ్యూ సైతం విధిస్తున్నట్టు కర్నాటక ప్రభుత్వ ప్రకటిచింది. బుధవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపింది. బుధవారం రాత్రి నుంచి గోవా సైత నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకువచ్చింది.