Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాట్సాప్, ఫేస్బుక్ అభ్యంతరాలను
తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నిర్ణయాన్ని సవాలు చేస్తూ వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. వివాదాస్పదమైన కొత్త ప్రైవసీ పాలసీపై దర్యాప్తు జరపాలని సిసిఐ గత నెల 24న నిర్ణయించింది. సుప్రీంకోర్టు ముందుకు ప్రైవసీ పాలసీ వచ్చినప్పటి నుండి వాట్సాప్ ఈ విషయమై తన వాదనలు వినిపిస్తూనే వుంది. సిసిఐ దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని పేర్కొంటోంది. వాట్సాప్‌తోపాటు ఫేస్బుక్ కూడా ఇదే విధమైన పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇది పోటీ అంశమే కాకపోయినా సిసిఐ దీనిపై దర్యాప్తు ప్రారంభించిందని వాట్సాప్ పేర్కొంది. యూజర్ల వ్యక్తిగత డేటా, దాన్ని షేర్ చేసుకోవడం వంటి అంశాలు ఇప్పటికే సుప్రీం కోర్టు ముందున్నాయని చెప్పింది. అందువల్ల సిసిఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటోంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో వున్న కేసుల ఫలితం గురించి వేచి వుండనందున సిసిఐ దర్యాప్తు ఆదేశాలను కొట్టిపారేయలేమని హైకోర్టు పేర్కొంది. డేటా అందుబాటులో వుండడం ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడానికి దారితీస్తుందా? లేదా? అని పరిశీలించేందుకే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు సిసిఐ చెబుతోంది.