Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్గ్రామ్ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సందర్భంగా ఇప్పటివరకు సుమారు 60 వేల మంది ప్రయాణికులు తమ ఉచిత సర్వీసులను ఉపయోగించుకున్నారని ఉబర్ తెలిపింది. హెల్ప్ఏజ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ సేవలు అందించినట్లు పేర్కొంది. ఇదే భాగస్వామ్యంలో 19 నగరాల్లోని ఆసరా లేని వృద్ధులు వాక్సినేషన్ సెంటర్కు ఉచితంగా వెళ్లి వచ్చేందుకు రాబోయే రోజుల్లో దాదాపు 25,000 ఉచిత రైడ్ లను అందించనున్నట్లు వెల్లడించింది.