Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి : ఒకవైపు దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రకంపనలు రేపుతోంది. మరోవైవు అసోంలోని సిల్చార్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించు కోవాల్సిన విమాన ప్రయాణికులు అధికారుల కళ్లుగప్పి దొడ్డి దారిన ఉడాయించారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది ప్రయాణికులు పరారయ్యారు. నిబంధనలను గాలికి ఒదిలి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కాచర్ జిల్లా అధికారులు సీరియస్గా స్పందించారు. విమాన ప్రయాణికులందరి వివరాలను సేకరిస్తున్నామని, అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ సుమిత్ సత్తవన్ వెల్లడించారు.