Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత భద్రత నడుమ ఆక్సిజన్ నింపుతున్న ఉద్యోగులు
విశాఖపట్నం : మహారాష్ట్ర నుంచి మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ కోసం బుధవారం రాత్రి ఏడు ట్యాంకర్లు ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నాయి. టాంకర్ల భద్రత పరిశీలించిన అనంతరం అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఆక్సిజన్ నింపుతున్నారు. వంద టన్నుల ఆక్సిజన్‌ను గురువారం సాయంత్రం మహారాష్ట్రకు పంపించనున్నారు. నాలుగు ట్యాంకర్లలో 16 టన్నుల చొప్పున 64 టన్నులు, మూడు ట్యాంకర్లలో 13 టన్నుల చొప్పున 39 టన్నులు... మొత్తం 103 టన్నుల ఆక్సిజన్ పంపించే పనిలో స్టీల్ ఉద్యోగులు నిమగమయ్యారు.