Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మాదాబాద్ : కొవిడ్ కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా దవాఖానల్లో ఆక్సిజన్ పడకల కొరత నెలకొనగా దళారీలు ఆపద సమయంలోనూ సొమ్ము చేసుకుంటున్నారు. గుజరాత్‌లోని రాజ్ కోట్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఓ ఏజెంట్ కొవిడ్ బెడ్ కోసం రోగి బంధువులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రూ 9000 ఇస్తే అరగంటలోనే ప్రభుత్వ దవాఖానలో బెడ్ ఇప్పిస్తానని జగదీష్ సోలంకి, హితేష్ మహిద అనే నిందితులు నమ్మబలుకుతూ ఈ వీడియోలో కనిపించారు. నిందితులు ఇద్దరూ జామ్ నగర్‌కు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. వీరిలో సోలంకి దవాఖానలో అటెండెంట్ కాగా, హితేష్ స్వీపర్ గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ బెడ్స్ కోసం పలువురు కొవిడ్-19 రోగులు గంటల తరబడి వేచిచూస్తున్న పరిస్థితి నెలకొనగా విపత్తు వేళ ఇలాంటి రాబందులు సొమ్ము చేసుకునేందుకు తెగబడటం దారుణమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.