Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు కోవిడ్ రోగులు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం అలీఘర్‌లోని నౌరంగాబాద్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు డా. సంజీవ్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఆరోపణలను ఖండిస్తూ..తమ వద్ద తగినంత ఆక్సిజన్ ఉందంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఆసుపత్రిలో మృతి చెందిన అనిల్ సోదరుడు శ్యామ్ కశ్యప్ మాట్లాడుతూ.. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆస్పత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగా 40 ఆక్సిజన్ సిలిండర్లను అప్పటికప్పడు అమర్చిందని ఆరోపిచారు.
ఒక వేళ ఆక్సిజన్ నిల్వలు ఉండుంటే..బుధవారం రాత్రి 9 గంటలకు ఆక్సిజన్ అందించాలంటూ అధికారులను ఎందుకు కోరతారు అంటూ ప్రశ్నించారు. ఐదుగురు కరోనా రోగులు చనిపోవడంతో....పలువురు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని..సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కాగా, రాత్రి 10 గంటల కల్లా అత్యవసరంగా ఆక్సిజన్ అందించాలని బుధవారం రాత్రి 9 గంటలకు ఆసుపత్రి యాజమాన్యం కోరినట్లు నగర మేజిస్ట్రేట్ వినీత్ కుమార్ తెలపడం గమనార్హం.