Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశం
బెంగళూరు : అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల విషయంలో కర్నాటక హైకోర్టు స్పందించింది. ప్రయివేటు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడిన రాష్ట్రంలోని రైతులకు చెందిన కుటుంబాలకు పరిహారం అందించడంపై ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటూ యడియూరప్ప సర్కారును ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభరు ఓకా, న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.