Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేటింగ్ ఏజెన్సీల అత్యుత్సాహం
- జీడీపీ రెండంకెలు పెరగొచ్చంటూ రిపోర్ట్లు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ రోజు రోజుకు తీవ్రమవుతోన్న వేళ మరోవైపు రేటింగ్ ఏజెన్సీలు మాత్రం భారత జీడీపీ రెండంకెల పెరుగుదలతో పరుగులు పెట్టనుందని ఊహాజనిత అంచనాలతో ఊదరగొడుతు న్నాయి. పైగా.. దేశం సమాగ్రాభివృద్ధిని చవి చూడనుం దని రిపోర్ట్లు ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత జీడీపీ 10.2 శాతం పెర గనుం దని కేర్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. ఇంతక్రితం మాసంలో అయితే ఏకంగా 11.2 శాతం వరకు పెర గొచ్చని పేర్కొంది. తాజాగా లాక్డౌన్ నిబంధనల నేప థ్యంలో స్వల్పంగా తగ్గొచ్చని తెలిపింది. ఇదే బాటలో ఎస్ అండ్పీ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ 11శాతం వృద్థి చోటు చేసుకోవచ్చని అంచనా వేసింది. కరోనా కేసులు పెరుగు దల ఆసియా-ఫసిపిక్ ప్రాంత ఆర్థిక వ్యవస్థలను ఒత్తిడికి గురి చేస్తోందంటూనే భారత జీడీపీ అంచనాలను అమాంతం పెంచి చూపిం చడం నిపుణులను విస్మయానికి గురి చేస్తోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ కూడా రెండంకెల వృద్థి నమోదు కావొచ్చని అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ మైనస్ 8 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వ ఏజెన్సీలు ఇప్పటికే అంచనా వేశాయి.
ఎవరి కోసం..?
దేశంలో కరోనా విజృంభించడంతో స్థానిక ప్రభుత్వాలు లాక్డౌన్ చర్యలను ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. రికవరీ రేటు చాలా తక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే మాంద్యంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుందనేది సుస్పష్టం. భారత జీడీపీ 10.5 శాతం పెరుగొచ్చని దేశంలో రెండో దశ కరోనా కేసులు ప్రారంభ సమయంలోనే ఆర్బీఐ అంచనా వేసింది. ఇప్పుడు పరిస్థితులు చేతులు దాటి పోతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లాక్డౌన్ ప్రకటించింది. మొత్తం దేశ జీడీపీలో ఈ రాష్ట్ర వాటా ఏకంగా 13.88 శాతంగా ఉంది. తెలంగాణలోనూ రాత్రి కర్యూ ప్రకటించారు. అనేక రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో ఆంక్షలు పెట్టాయి. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేసినట్టు ప్రకటించింది. డిమాండ్ లేక అనేక తయారీ రంగ కంపెనీలు ఉత్పత్తికి కోత పెట్టుకుంటున్నాయి.ఆర్థిక కార్యకలాపాలు పడిపోయాయి. ప్రజల ఉపాధి తగ్గిపోవడంతో కొనుగోలు శక్తి హరించుకు పోతోంది. వలస కార్మికులు మళ్లీ రోడ్డున పడుతు న్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ జీడీపీ రెండం కెల వృద్ధిని కనబర్చనుందన్న రేటింగ్ ఏజెన్సీల అంచనాలు విస్మయానికి గురి చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత లాక్డౌన్ ఆంక్షల వల్ల వ్యాపారాలు, విద్యుత్ వినియోగం, ఇ-వే బిల్లు వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకుంటు న్నాయి. ఇటీవల స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి.