Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోనిపట్ నుంచి సింఘూ వరకు
న్యూఢిల్లీ: ఆపరేషన్ శక్తిలో భాగంగా శుక్రవారం రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో బార్వాస్ని నుండి సింఘూ సరిహద్దు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) సమన్వయ కర్త దర్శన్ పాల్ తెలిపారు. డిల్లీలోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్పూర్ సరిహద్దుల్లో రైతు ఉద్యమం గురువారంతో 146వ రోజుకు చేరింది. వేలాది మంది రైతులు భాగస్వామ్యం అవుతున్నారు.
ప్రభుత్వ ఆపరేషన్ క్లీన్ను ఎదుర్కోవటానికి ఆపరేషన్ శక్తిలో భాగంగా ట్రాక్టర్ ట్రాలీల్లో నిరసనకారులు బయలుదేరుతున్నారు. ర్యాలీలో చాలా మంది మహిళా రైతులు కూడా భాగస్వామ్యం కానున్నారు. ఎస్కెఎం నాయకులు హర్యానా ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. సింఘూ బోర్డర్ వద్ద హైవేకి ఒక వైపు బారికేడ్లను తొలగించి, ఆక్సిజన్, అంబులెన్సులు, మందులు, ఇతర అత్యవసర సేవలకు అనుమతి ఇచ్చారు. రైతులు ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నారని బిజెపి ప్రభుత్వం నిరాధారంగా ఆరోపించిందని, అలాంటిదేమీ లేదని దర్శన్ పాల్ తెలిపారు.
పోలీసులను మోహరించిన హర్యానా సర్కారు
హర్యానా ప్రభుత్వం రైతులపై అన్యాయమైన యుద్ధాన్ని కొనసాగిస్తోందని, అందులో భాగంగానే అశోడా టోల్ ప్లాజా వద్ద రైతులను పంపించేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని దర్శన్పాల్ విమర్శించారు. పోలీసులతో వాగ్వాదం తరువాత రైతులు టోల్ ప్లాజాను తిరిగి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. బిజెపి నాయకులు వివిధ ప్రాంతాల్లో రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా పాటియాలాలో బిజెపి పంజాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హర్జిత్ సింగ్ గ్రెవాల్ను రైతులు అడ్డుకున్నారు.