Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంవిపి.కాలనీ (విశాఖ)
ఈ నెల 21న తప్పిపోయిన ఇండోనేషియా జలాంతర్గామికి సంబంధించిన టెంటారా నేషనల్ ఇండోనేషియా-అంగ్కటన్ లాట్ (టిఎన్ఐ ఎఎల్ - ఇండోనేషియా నేవీ)ను వెతకడానికి భారత నావికాదళం డీప్ సబ్మెరెన్స్ రెస్క్యూ వెసెల్ (డిఎస్ఆర్వి)ను గురువారం పంపించింది. ఇండోనేషియా జలాంతర్గామి 53 మంది సిబ్బందితో బాలికి 25 మైళ్ల ఉత్తరాన అదృశ్యమైనట్లు అంతర్జాతీయ జలాంతర్గామి ఎస్కేప్ అండ్ రెస్క్యూ లైజన్ ఆఫీస్ (ఇస్మెర్లో) ద్వారా భారత నావికాదళం సమాచారం అందుకుంది. ఇండియన్ నేవీ డిఎస్ఆర్వి వ్యవస్థ, అత్యాధునిక సైడ్ స్కాన్ సోనార్ (ఎస్ఎస్ఎస్),రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ (ఆర్ఒవి) ను ఉపయోగించి 1000 మీటర్ల లోతు వరకు ఉన్న జలాంతర్గాములను కనుగొనగలదు.