Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. బెడ్స్‌తో పాటు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అక్కడ గత మూడు రోజులుగా ఆక్సిజన్ సమస్య నెలకొందని ఆరోగ్య శాఖ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగుల చికిత్స కోసం ఢిల్లీకి ఆక్సిజన్ కోటా పెంచాలని మోడీ సర్కార్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్రక్కులను యూపీ, హర్యానా రాష్ట్రాలు నిలిపేస్తున్నారని ఆరోపించారు. కరోనా మహమ్మారిని అందరమూ సమైక్యంగా ఎదుర్కోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మరోవైపు హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చే ఆక్సిజన్ ట్రక్కులు సజావుగా వచ్చేందుకు సహకరించాలని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌తో మాట్లాడానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ విషయంలో పూర్తి మద్దతిస్తామని ఖట్టర్ తమకు హామీ ఇచ్చారని కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఉందని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఆక్సిజన్ కావాలంటూ పలు ఆస్పత్రుల నుంచి మెసేజ్‌లు, మెయిల్స్ కూడా వస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతానికి ఇతర ఆస్పత్రుల నుంచి కొరతగా ఉన్న ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని సిసోడియా తెలిపారు.