Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం ఖర్చు ఎంతంటే..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏండ్లకు పైబడిన వారందరికీ కరోనా టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. మే 1 నుంచీ ప్రారంభం కానున్న మూడో దఫా టీకా కార్యక్రమంలో పెద్దలందరికీ టీకా అందుబాటులోకి రానుంది. అయితే..ఓ అంచనా ప్రకారం భారత జనాభా మొత్తం 133 కోట్లు. అందులో 18 ఏండ్లకు పైబడిన వారి సంఖ్య 84.2 కోట్లు. వీరందరికీ టీకా ఇవ్వాలంటే దాదాపు రూ. 671.93 బిలియన్లు ఖర్చవుతుందని ఇండియా రేటింగ్స్ సంస్థ తాజాగా లెక్కగట్టింది. బుధవారం విడుదలైన టీకా ధరల ఆధారంగా ఇండియా రేటింగ్స్ ఈ అంచనాకు వచ్చింది. ఈ ఖర్చు దేశ జీడీపీలో దాదాపు 0.36 శాతం కావడంతో ప్రభుత్వం ఈ మొత్తాన్ని భరించగలదని కూడా వ్యాఖ్యానించింది. ఈ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరిస్తే కేంద్రం తన బడ్జెట్లో 0.12 శాతాన్ని, రాష్ట్రాల మొత్తం బడ్జెట్లో 0.264 శాతాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ''ప్రస్తుతమున్న సమస్య తీవ్రత, అర్థికవ్యవస్థపై పడే ప్రభావం దృష్ట్యా ఈ మొత్తం చాలా చిన్నది'' అని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.
ప్రధాని మోడీ బిజీ... బిజీ....
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం బిజీబిజీగా గడపనున్నారు. 3 గంటలు... 4 అత్యున్నత స్థాయి సమావేశాలు.. ఇదీ.. శుక్రవారం నాటి మోడీ షెడ్యూల్. ఉదయం 9 గంటలకు కోవిడ్‌పై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అది పూర్తి కాగానే 10 గంటలకు కోవిడ్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఆక్సిజన్ మ్యానిఫాక్చరింగ్ చేసే కంపెనీలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. దీని తర్వాత మరిన్ని సమావేశాలుంటాయని సమాచారం. వీటన్నింటి దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాటి బెంగాల్ పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ''కరోనా పరిస్థితిని సమీక్షించడానికి శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ కారణంగానే బెంగాల్‌కు నేను వెళ్లడం లేదు'' అని మోడీ ట్వీట్ చేశారు.