Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య సేతు యాప్‌ల ద్వారా పేర్లు నమోదు: కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో 18 ఏండ్లు పైబడినవారందరూ కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఈనెల 28 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ కో-విన్ పోర్టల్‌లో కానీ, ఆరోగ్య సేతు యాప్‌లో కానీ వాక్సినేషన్‌ను అర్హులైనవారందరూ రిజిస్టర్ కావచ్చు. ఈ మేరకు కేంద్రం తెలిపింది. మూడో దశలో భాగంగా దేశంలో 18 ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరికీ మే 1 నుంచి వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. దేశంలో తీవ్రంగా పెరిగిపోతున్న కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా కేంద్రం ఇటీవలే ఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, ఇప్పటి వరకు దేశంలో వైద్యులు, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు 45 ఏండ్ల కంటే పైబడినవారంతా వ్యాక్సిన్‌ను పొందుతున్నారు. కాగా, మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు తమ సగం వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు ఆస్పత్రులకు విక్రయించవచ్చు. తీవ్ర పరిస్థితుల్లో ఉన్న తొలి 30 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని కేంద్రం ఇప్పటికే తెలిపింది. ఆ తర్వాత ఇచ్చే వ్యాక్సిన్లకు రాయితీ ఉండదని ప్రకటించింది.