Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 43 స్థానాలకు 79శాతానికి పైగా పోలింగ్
- 26న ఏడో దశ ఎన్నికలు
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆరోదశ పోలింగ్ ముగిసింది. నాలుగు జిల్లాల్లో మొత్తం 43 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 79.03శాతం పోలింగ్ (సాయంత్రం 5 గంటల వరకు) నమోదైందని అధికారులు తెలిపారు. కట్టుదిట్ట మైన భద్రత, కరోనా మార్గదర్శకాల మధ్య 14,480 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. నదియా జిల్లాలో అత్యధికంగా దాదాపు 83 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని బ్యార్రక్పోర్ నియోజకవర్గంలో తక్కువగా 67శాతం పోలింగ్ రికార్డయ్యింది.
ఆరోదశ పోలింగ్ షెడ్యూల్ ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నది. ఉత్తర 24 పరగణాలులోని 17 అసెంబ్లీ స్థానాలు, నదియా జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని 9 స్థానాలకు, పూర్వ బర్ధామన్ జిల్లాలోని 8 స్థానాలకు పోలింగ్ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు కలుపుకొని 306 మంది ఈ దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షిం చుకోనున్నారు.