Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో రెండువారాలుగా పోరాడి తుదిశ్వాస విడిచిన ఆశిష్ ఏచూరి
- పీఎం మోడీ, రాష్ట్రపతి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తదితర ప్రముఖుల నివాళి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూర్ణో
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి పెద్దకుమారుడు ఆశిష్(35) గురువారం ఉదయం కన్ను మూశారు. గత రెండు వారాల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఢిల్లీ గురగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఇన్ఫెక్షన్ పెరగడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'కోవిడ్-19 ఇన్ఫెక్షన్తో నాపెద్ద కుమారుడిని కోల్పోయానన్న బాధాకరమైన విషయం మీకు తెలియచేస్తు న్నాను. ఇంతటి క్లిష్ట సమయంలో నా కుమారు డికి చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు, ప్యారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు. నాకు అండగా నిలిచిన వారికి కతజ్ఞతలు' అని ఏచూరి ట్విట్ చేశారు. ఈ బాధాతప్త సమయంలో తనకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలి పారు. ఇంతమంది అండగా ఉండటంతో తాను ఒంటరికాదని నిరూపితం అయిందన్నారు. తన బాధను పంచకున్న ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆశిష్ న్యూస్ లాండ్రి అనే ఆన్ లైన్ న్యూస్ పోర్టల్‌కి అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర మీడియా సంస్థల్లో పనిచేశారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో... ప్రముఖుల నివాళి
సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి, ఇంద్రాణీ మజుందార్‌ల కుమారుడు ఆశిష్(35) అకాల మరణంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సంతాపం ప్రక టించింది. అతి చిన్న వయసులో ఆశిష్ మృతి చెందడం బాధాకరమని తెలి పింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఆశిష్ మతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, జవదేకర్, పియూష్ గోయల్, గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేరళ సీఎం పినరరు విజ యన్, ఏపీ సీఎం జగన్, రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీపీఐ నేత డి రాజా, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, శశిథరూర్, అధీర్ రంజన్ చౌదరీ, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, తదితర వామపక్ష నేతలు నివాళి అర్పిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. ఆశిష్ ప్రస్తుతం సేవలందిస్తున్న న్యూస్ లాండ్రి సంస్థ ఆయనకు ఘన నివాళులర్పించింది.