Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి : అసోంలో అసెంబ్లీ ఫలితాలు వెల్లడికి ముందే కాంగ్రెస్ తన అభ్యర్థులను రిసార్ట్‌కు పంపింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ విజయం సాధించిన తన అభ్యర్థులను కొనుగోలు చేస్తుందనే భయంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. గౌహతికి 30 కిమీ దూరంలో ఉన్న సోనాపూర్‌లోని ఒక రిసార్ట్‌కు తరలించింది. ఇటీవల మూడు దశల్లో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 6తో ముగిసాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల్లో అధికార బిజెపికి ప్రజల నుంచి గుణపాఠం తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో మహా కూటమి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ 95 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలిపింది.