Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లు, ఎస్పిలే బాధ్యులు
- ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్రం ఉత్తర్వులు
న్యూఢిల్లీ : ప్రస్తుత కరోనా విపత్తు నేపథ్యంలో అంతరాష్ట్ర ఆక్సిజన్ రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను కేంద్ర ప్రభుత్వం గురువారం ఆదేశిం చింది. ఇందుకు సంబంధించి ఆయా అధికారులను వ్యక్తిగత బాధ్యులుగా చేస్తూ కేంద్రం విపత్తు నిర్వహణ చట్టం-2005ను ప్రయోగించింది. అదే విధంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఉందన్న పేరుతో నిర్దిష్ట రాష్ట్రానికి సరఫరాను పరిమితం చేయొద్దని స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాలో ఏర్పడుతున్న సమస్యలపై వెంటనే స్పందించి, తగిన పరిష్కారం చూపాలని ఢిల్లీ హై కోర్టు ఆదేశించిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. హర్యానాలోని పానిపట్ నుంచి రావాల్సిన అక్సిజన్ను అక్కడి స్థానిక పోలీసులు తీసుకెళ్లనివ్వడం లేదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా పలు ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చుకునేందుకు అధికారులు అడ్డుపడుతు న్నారని తెలిపింది.