Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిలటరీ నిర్ణయం
న్యూఢిల్లీ : జర్మనీ నుండి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మిలటరీ దిగుమతి చేసుకుంటోందని ఎఎఫ్ఎంఎస్ (సాయుధ బలగాల మెడికల్ సర్వీసెస్) అధికారి తెలిపారు. కోవిడ్ రోగులకు చికిత్సనందించే ఎఎఫ్ఎంఎస్ ఆస్పత్రుల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారని చెప్పారు. కరోనా సెకండ్‌వేవ్ వల్ల ఆక్సిజన్ సంక్షోభం తలెత్తడంతో సమస్య పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకు న్నట్లు ఆ అధికారి శుక్రవారం తెలిపారు. వారం రోజుల్లో ఇవి భారత్‌కు వస్తాయన్నారు. ఒక్కో ప్లాంట్ గంటకు 2400 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రకంగా, 24గంటలూ 20 నుంచి 25మంది రోగుల అవసరాలను తీర్చడానికి అవకాశముంటుంది. సులభంగా తరలించడానికి అవకాశముండడమే ఈ ప్లాంట్ల వల్ల లాభమని చెప్పారు.