Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్రకు చెందిన మరో పోలీస్ ఇన్స్పెక్టర్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) శుక్రవారం అరెస్టు చేసింది. పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల కేసు, వ్యాపారవేత్త మన్షుక్ హిరేన్ హత్య కేసుల్లో విచారణ కోసం గురువారం ముంబయి పోలీస్ ఇన్స్పెక్టర్ సునీల్ మానేను పిలిచింది. ఆ తరువాత అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఎ అధికారులు తెలిపారు. శుక్రవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి నట్లు కూడా చెప్పారు. ఈ కేసుల్లో ఇప్పటికే పోలీసు అధికారులు సచిన్ వాజే, రియాజ్ ఖాజీతో సహా నలుగుర్ని ఎన్ఐఎ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.