Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ చివరి రెండు విడతల ఎన్నికలకు సంబంధించి వామపక్షాల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చిన్నపాటి సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జమురియా నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఐషే ఘోష్‌కు మద్దతుగా పరిమిత సంఖ్యలో నిర్వహించిన సభకు లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసు హాజరై మాట్లాడారు. ఘజోల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బబూపూర్లో జరిగిన ప్రచార కార్యక్రమానికి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మహ్మద్ సలీం హాజరయ్యారు. పంద్బేశ్వర్లోని ఒక గ్రామంలో సిపిఎం అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మీనాక్షి ముఖర్జీ పాల్గొన్నారు. బలిఘంజ్ అభ్యర్థి డాక్టర్ ఫౌద్ హలీం కోవిడ్ బాధితులకు చికిత్సలో సాయపడే ప్లాస్మా దానం చేశారు. ఇంగ్లీష్ బజార్ నియోజకవర్గ ఘనిపూర్ ఏరియాలో పార్టీ అభ్యర్థి కౌశిక్ మిశ్రా ఇంటింటి ప్రచారం చేశారు.