Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : తీవ్రంగా బాధపడుతున్న కోవిడ్ రోగులకు చికిత్స విషయంలో మెడికల్ ఆక్సిజన్ అవసరమైతే ముందుగా ప్రభుత్వ నోడల్ అధికారిని కలవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆస్పత్రులను, నర్సింగ్ హోంలను కోరింది. ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న రెండు ప్రైవేటు ఆస్పత్రులు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు బెంచ్ ఈ మేరకు సూచనలు జారీ చేసింది. నోడల్ అధికారితో మాట్లాడినా అవసరాలు తీరకపోతే అప్పుడు సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, న్యాయవాది సత్యకమ్లను కలిసి మాట్లాడాలని, ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని జస్టిస్ విపిన్ సాంఘి, జస్టిస్ రేఖా పల్లి కోరారు. తమ ఆస్పత్రుల్లో చేరిన కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అవసరముందంటూ బ్రామ్ హెల్త్ కేర్ లిమిటెడ్, బత్రా హాస్పిటల్, మెడికల్ రీసెర్చ్ సెంటర్లు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది.