Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో గత 24 గంటల్లో కరోనాతో అత్యధికంగా 2263 మంది మరణించారు. 3,32,730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వరుసగా రెండో రోజూ మూడు లక్షల కేసులు దాటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కు, మరణాల సంఖ్య 1,86,920కు, కోలుకున్న వారి సంఖ్య 1,36,48,159కు చేరింది. ఒక్క రోజులోనే 1,93,279 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 24,28,616 ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 83.92 శాతం ఉంది. పది రాష్ట్రాల్లో 89 శాతం కేసులు నమోదు కాగా, 82 శాతం మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 31,47,782 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్పటి వరకు 13,54,78,420 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.