Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : దేశంలో ప్రస్తుతం కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సిఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో శుక్రవారం వర్చవల్‌గా జరిగిన ఎన్నికల సభలో మమత మాట్లాడారు. మమతకు ఇది తొలి వర్చువల్ సమావేశం కావడం విశేషం. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌కు కేటాయించిన ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు కేంద్రం తరలిస్తోందని ఆరోపించారు. 'కోవిడ్ రెండో దశ కోసం ఆక్సిజన్, మందులు నిల్వ ఉంచలేదు. పైగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మార్చి 7న కరోనా వైరస్ దేశం నుంచి వెళ్లిపోయిందని చెప్పారు' అని మమత ఆరోపించారు. 'ఇంత తీవ్రస్థాయిలో కరోనా విజృంభిచడానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణం. దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉన్న సమయంలోనూ బెంగాల్ ఎన్నికలపైనే బిజెపి నేతలు దృష్టి పెట్టారు. దేశం నలుమూలల నుంచి బిజెపి నేతలు ఇక్కడికి తరలివచ్చారు' అని మమతా చెప్పారు. ప్రధాని మోడీ తన సభలను రద్దు చేసుకున్న తరువాత ఎన్నికల కమిషన్ ప్రచార సభలపై నిషేధం విధించిందని ఆమె ఆరోపించారు.