Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ బ్యూరో
మూడు వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న రైతు ఉద్యమం కొనసాగుతోంది. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతు ఆందోళనలు 147వ రోజుకు చేరుకున్నాయి. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహాన్పూర్ సరిహద్దుల్లో రైతుల ఆందోళన జరుగుతుంది. పంట కోతకు వెళ్లిన పంజాబీ రైతులు ఆందోళన వేదికల వద్దకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఆపరేషన్ క్లీన్ను ఎదుర్కోవటానికి ఆపరేషన్ శక్తిలో భాగంగా ట్రాక్టర్ ట్రాలీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చాలా మంది మహిళా రైతులు కూడా భాగస్వామ్యమయ్యారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో బార్వాస్ని నుంచి సింఘూ సరిహద్దు వరకు ర్యాలీ నిర్వహించారు.