Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండోర్ : లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించారనే అసత్య వార్తను ప్రచారం చేశారనే ఆరోపణలతో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. స్థానిక బిజెపి నేత, మాజీ కార్పొరేటర్ సుధీర్ డెడ్జ్ ఫిర్యాదు మేరకు సరఫ పోలీస్ స్టేషన్ల్లో శుక్రవారం ఈ కేసు నమోదు చేశారు. సుమిత్రా మహాజన్ మరణించారనే వార్త గురువారం రాత్రి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా సంస్థలతో పాటు, శశిధరూర్ వంటి నేతలు కూడా ఈ వార్తను ట్వీట్ చేశారు.