Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు మళ్లించరాదని డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల్లోని వివిధ ఆస్పత్రుల నుంచి ఎస్‌వోఎస్ ఆక్సిజన్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ డిమాండ్ చేశారు. ఆక్సిజన్ వినియోగస్థాయిలు రోజుకు 450 మెట్రిక్ టన్నులకు పెరగనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర అవసరాల్ని పరిగణలోకి తీసుకుని ఆక్సిజన్‌ను వేరే ప్రాంతాలకు మళ్లించ్చొద్దని బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.