Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఖాతాదారుల ఫిర్యాదులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో కొత్తగా 'కంప్లైంట్స్ డాష్బోర్డ్'ను ఏర్పాటు చేసినట్లు ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (ఎఫ్జిఐఎల్ఐ) తెలిపింది. వినియోగదారుల సంతప్తి మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో దీన్ని అందుబాటులోకి తెచ్చామని ఆ సంస్థ పేర్కొంది. దీంతో భవిష్యత్తులో ఫిర్యాదులు తగ్గనున్నాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇది తమ సేల్స్ టీమ్ వేగంగా, సమర్థవంతమైన పద్ధతిలో ఫిర్యాదులను గుర్తించడానికి, పరిష్కరించడానికి దోహదం చేయనుందని ఆ సంస్థ చీఫ్ రిస్కు ఆఫీసర్ బికాస్ చౌదరీ పేర్కొన్నారు.