Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కెనరా రొబెక్కో ఎస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ కొత్తగా కెనరా రొబెక్కో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ నిధులను వైవిధ్యమైన రంగాలలోని లార్జ్‌క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో గరిష్టంగా 30 స్టాక్స్‌పై పెట్టుబడిగా పెట్టనున్నట్లు పేర్కొంది. నూతన ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఒ) ఏప్రిల్ 23న ఆరంభమై.. వచ్చే నెల మే 7న మూసివేయనుంది. తిరిగి మే 18న తెరువనుంది. మధ్యస్థం నుంచి దీర్ఘకాల పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందాలనుకునే మదుపరులకు ఇది అనుకూలంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.