Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్వే పర్వతారోహకుడికి పాజిటివ్
కాఠ్మండు: పప్రంచాన్ని వణికిస్తున్న కరోనా మమమ్మారి ఎవరెస్ట్‌కు ఎగబాకింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత్వాన్ని కూడా వైరస్ చేరుకున్నది. నేపాల్‌లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న నార్వే దేశానికి చెందిన ఎర్లెండ్ నెస్‌కు కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. దీంతో పర్వతంపైనున్న బేస్ క్యాంపు నుంచి అతడితోపాటు ఒక షెర్పాను హెలికాప్టర్లో కాఠ్మండులోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలో తమ ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఎర్లెండ్ నెస్ తెలిపారు. ప్రస్తుతం తనకు బాగానే ఉన్నదని ఆయన చెప్పారు. ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంపై మరెవరూ కరోనా బారిన పడకూడదని ఆశిస్తున్నట్టు నెస్ వెల్లడించారు. పర్వతాలపై గాలి పీల్చడం చాలా కష్టమని, అక్కడ కరోనా సోకితే పర్వతారోహకులకు చాలా ప్రమాదమని అన్నారు. అలాగే 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్నవారిని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించడం కూడా కష్టసాధ్యమని తెలిపారు.