Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సంగీత ద్వయం (నదీమ్-శ్రవణ్)గా పేరుగాంచిన వారిలో ఒకరైన శ్రవణ్ రాధోడ్ కరోనాతో గురువారం మృతి చెందారు. కాగా, కొన్ని రోజుల క్రితమే శ్రవణ్, ఆయన భార్య కుంభమేళాకు వెళ్లి వచ్చారు. ఇప్పటికే కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారిలో పలువురికి కరోనా సోకడం కలకలం రేకెత్తిస్తున్న సమయంలో... ప్రముఖ సంగీత దర్శకుడు కూడా ఇక్కడికి వెళ్లొచ్చాక బలికావడం గమనార్హం. కుంభమేళాకు వచ్చిన అనంతరం ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో... భార్యాభర్తలిద్దరూ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడ్డారని వారి కుమారుడు సంజీవ్ తెలిపారు. తమకు ఇంతటి కఠిన పరిస్థితులు వస్తాయని ఊహించలేదని అన్నారు. తన తల్లికి, తన సోదరుడు, తాను కరోనా బారిన పడ్డామని, తాము హౌం ఐసోలేషన్లో వున్నామని తెలిపారు. తన తండ్రి అంత్యక్రియలు నిర్వ హించేందుకు తన సోదరుడికి మాత్రమే అనుమతినిచ్చారని చెప్పారు.