Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యతిరేకించిన సీపీఐ(ఎం)
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో ఉద్యోగులను పర్యవేక్షించడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)ను ఏర్పాటు చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకరించింది. ఉద్యోగులను పర్యవేక్షించే చర్యలను 'ఏకపక్షం, క్రూరమైన' వని సీపీఐ(ఎం) నేత ఎం వై తరిగామి విమర్శించారు. ''దేశ వ్యతిరేక' కార్యకలాపాలలో దొరికినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఎటువంటి విచారణను నిర్వహించకుండా తొలగించడానికి, ఇతర శిక్షాత్మక చర్యలను తీసుకోవడానికి ఎస్టీఎఫ్ ఏర్పాటు చేయాలన్న జమ్ముకాశ్మీర్ పరిపాలన యొక్క తాజా ఉత్తర్వు ఏకపక్షమైనది, క్రూరమైనది. ఇది ఈ ప్రాంతంలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధం' అని తరిగామి పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ఉద్యోగుల్లో కోపం, అసంతృప్తిని మరింత పెంచుతాయని ఆయన హెచ్చరించారు. ఈ ఉత్తర్వులను సమీక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒక ఉద్యోగి మొదటగా పౌరుడని, అతనికి అన్ని రాజ్యాంగ హక్కులు ఉంటాయని చెప్పారు. ఇలాంటి హక్కులను రక్షించడం అవసరమని తరిగామి తెలిపారు.