Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10,000 మంది పోలీసులకు పాజిటివ్
బెంగళూరు : కరోనా మహమ్మారి దెబ్బతో సామాన్య ప్రజలతో పాటు పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు. కరోనా వైరస్ హమమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తున్న 10 వేల మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో సాటి పోలీసులు హడలిపోతున్నారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంతో పాటు కర్నాటకలో ఇప్పటి వరకు 9, 990 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని స్వయంగా అధికారులు చెప్పడంతో మిగతా పోలీసుల్లో కలవరం మొదలైయ్యింది. కరోనా వైరస్ బారినపడి చికిత్స విఫలమై ఇప్పటి వరకు 107 మంది పోలీసుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కర్నాటకలో ఇప్పటి వరకు 76,000 మంది పోలీసులకు కోవిడ్ వ్యాక్సిన్ అందించారని, 46,000 మంది పోలీసులకు సెకండ్ డోస్ ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు.