Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగాల్ : కరోనా వైరస్ పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు. వైరస్ వచ్చిన తొలినాళ్లలో అవగాహన రాహిత్యంతో కోవిడ్ సోకిన వారిని బంధువులా, స్నేహితులా, కుటుంబ సభ్యులా అని కూడా చూడకుండా .. వాళ్లను విలన్లు చూసినట్టు చూశారు. అంతేకాకుండా వైరస్ వచ్చిందని తెలిసి..ఇంటి నుంచి గెంటేయడం..కొట్టి చంపేయడం వంటి ఘటనలు విన్నాం. ఇలానే ఓ వ్యక్తి గత ఏడాది కరోనా బారిన పడి... పొరుగువాళ్ల చేతిలో బహిష్కరణకు గురై...కోలుకున్నాక... కరోనా అవగాహన చర్యలు చేపడుతూ, మాస్కులు పంచుతూ పేరు తెచ్చుకుంటున్నారు.
దక్షిణ కోల్‌కత్తాలోని గంగూలీ బగాన్‌లో తన భార్యతో కలిసి జీవిస్తున్నారు 74 ఏండ్ల పరిమళ్ దే. గత ఏడాది కరోనా బారిన పడటంతో...అతను పొరుగుళ్లిల్లో వారు ఆయన్ను పురుగును చూసినట్టు చూశారు. తాము హౌం క్వారెంటైన్లో ఉన్నా కూడా...పండ్లు, కూరగాయాలు, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వవద్దని కొందరినీ బెదిరింపులకు గురి చేశారంటున్నారు పరిమళ్ దే. తనకు జరిగినట్టే..నలుగురికి అవమానం జరగకూడదన్న ఉద్దేశంతో..తనకు నయం అయిన తర్వాత ప్రజలకు అవగాహన కల్పించాలని సంకల్పించుకున్నారు. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్న ఆయన కరోనా నుంచి కోలుకున్నాక మాస్కులు పంచడం మొదలు పెట్టానన్నారు. తొలుత చాలా అంటే చాలా తక్కువ మంది తీసుకునేవారు. అనంతరం చిప్స్ ప్యాకెట్‌ను ఎరగా చూపించి మాస్కులు ఇవ్వడం మొదలు పెట్టారు. మాస్కులు కోసం కాకపోయినా..చిప్స్ ప్యాకెట్స్‌కు తీసుకునేందుకు వస్తారన్నదీ ఆయన ఆలోచన. అనంతరం కరోనా ఉధృతి తగ్గాక కొన్ని నెలల పాటు దీన్ని ఆపేశారు. తిరిగి కేసులు పెరుగుతుండటంతో.. బయట పరిస్థితులు బాగోలేదు...వెళ్లవద్దని భార్య వారించినప్పటికీ... పరిమళ్ తన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తన ఇంటికి సమీపంలో ఉన్న రద్దీ మార్కెట్ ప్రాంతాల్లో మాస్కులు, శానిటైర్లు, చాకెట్లు పంచుతున్నారు. తన భార్య తన పట్ల పడే తపన, ఆవేదన తెలుసునని, కానీ కరోనాపై ఎవరో ఒకరు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో తాను ముందుకు వచ్చి..ఇవి చేశానని అన్నారు.