Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నది. అత్యవసర చికిత్స నిమిత్తం ఆక్సిజన కొరత వల్ల.. ఐసీయూ పడకలు లేక ఎంతో మంది మరణిస్తున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత ఏవిధంగా ఉందో రాజధాని ఢిల్లీ ఆస్పత్రుల్లోని పరిస్థితుల్ని చూస్తే అర్థమౌతోంది. తాజాగా ఢిల్లీలోని సెవెన్ మాక్స్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ రోగులను ఆస్పత్రిలో అడ్మిట్ కావొద్దని విజ్ఞప్తి చేస్తూ.. ఆస్పత్రి వర్గాలు ట్వీట్ చేశాయి. ఆ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఒంటిగంట నుంచే ఆక్సిజన్ సిలిండర్లు నిండుకున్నట్టు సమాచారం. ఆక్సిజన్ కేవలం ఒక గంట కంటే తక్కువకు మాత్రమే నిల్వ ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆస్పత్రిలో కోవిడ్ రోగులు 700 మందికి పైగా చేరారని.. ఇక నుంచి పేషెంట్లు ఆస్పత్రిలో అడ్మిట్ కావొద్దని చెప్పటానికి ఎంతో చింతిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ట్వీట్ చేశాయి. 'తక్షణమే ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ.. ప్రధాని కార్యాలయానికి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ అత్యవసర సందేశాన్ని పంపాయి. ఈ సందేశం తర్వాత అధికారులు అప్రమత్తమై.. ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లు పంచారు. అయినా ఈ ఆక్సిజన్ కేవలం రెండు గంటల వరకు మాత్రమే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఆక్సిజన్ పంపించాలని కోరుతూ.. ఆస్పత్రి వర్గాలు మరో తాజా ట్వీట్లో కోరాయి. అయితే కొత్తగా పాజిటివ్ వచ్చిన కోవిడ్ రోగులను తమ ఆస్పత్రిలో చేర్చుకోం అని ఆస్పత్రి వర్గాలు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నాయి.
ఈ వారంలో సెవెన్ మ్యాక్స్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో 1,400 మందికి పైగా కోవిడ్ రోగులు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆక్సిజన్ కొరత వల్ల రెండు నుంచి 18 గంటల ఆక్సిజన్‌ను తగ్గించాయి. ఈ ఆస్పత్రిలో తక్కువ ఆక్సిజన్ సరఫరాపై పిటిషన్ వేయగా... బుధవారం రాత్రి ఆ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ఆక్సిజన్ సరఫరా, రవాణా సవాళ్లపై దాదాపు రెండు గంటలపాటు ఈ పిటిషన్‌పై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు విచారణ జరిపారు. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు... 'అత్యవసర పరిస్థితుల్లో కూడా.. ఆక్సిజన్ సరఫరా పెంచడానికి మార్గాలను అన్వేషించడం లేదు. ఆస్పత్రులకు తగినంత ఆక్సిజన్ సరఫరా చేయడానికి రుణాలు తీసుకోవచ్చు. లేదా.. అడగొచ్చు ' అని కేంద్రంపై మండిపడింది.