Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ సరఫరా విషయమై సీఎం జగన్ ఇప్పటికే భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ ఎండీలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడిపై లోతుగా చర్చించామని, వైరస్ కట్టడికి సీఎం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సిన్ ము ఖ్యమని, మొదటి నుంచి అందుకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకు న్నారన్నారు. రూ.1,600 కోట్ల నిధులు వెచ్చించి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.దీంతో పాటు శనివారం నుంచి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తామని, మరోవైపు కరోనా పరీక్షలు కూడా పెంచుతామని చెప్పారు. సిటీ స్కాన్ కేంద్రాల వద్ద ప్రజల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వాటిని కూడా నియంత్రిస్తామని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ తీసుకుంటే చర్యలు తప్పవని అన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు.