Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమికస్ క్యూరీగా తప్పుకున్న హరీశ్ సాల్వే
- కోవిడ్ ఉధృతిపై విచారణ 27కు వాయిదా
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ ఉధృతిపై సుప్రీంకోర్టు సుమోటోగా చేపడుతున్న విచారణ నుంచి ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే అమికస్ క్యూరీగా తప్పుకొన్నారు. దేశం ప్రస్తుతం అత్యంత అయోమయ స్థితిలో ఉందన్న సాల్వే.. న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత క్లిష్టమైన విచారణ ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ బోబ్డే తనకు ఎప్పటినుంచో తెలిసి ఉన్నం దున ఈ విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్లు తెలిపారు. దీంతో శుక్రవారం జరగాల్సిన విచారణ ఈ నెల 27కు వాయిదాపడింది. అమికస్ క్యూరీ (సహాయ కుడిగా)గా తన నియమాకాన్ని కొంత మంది సీనియర్ లాయర్లు విమర్శించడం పట్ల సాల్వే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బోబ్డే తనకు తెలిసిన వ్యక్తి అయినందునే తనను అమికస్ క్యూరీగా నియమించారన్న విమర్శలు తనను బాధించిందని హరీశ్ సాల్వే తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.ఏ బోబ్డే శుక్రవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈపరిణామం చోటు చేసుకో వడం గమనార్హం.