Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారినే రాష్ట్రంలోకి అనుమతించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టిపిసిఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి విమానాల్లో వచ్చేవారంతా తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించాలని ప్రకటించింది.