Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేజ్రీవాల్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ కొరత పెద్ద విపత్తుగా మారింది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సాయం కోరారు. అదనంగా ఆక్సిజన్ ఉంటే ఢిల్లీకి పంపాలని తన సహచర ముఖ్యమంత్రులకు లేఖ ద్వారా అభ్యర్థించారు. ' మీ వద్ద స్పేర్ (అదనంగా) ఉంటే...ఢిల్లీకి అందించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశాను. కేంద్ర ప్రభుత్వం కూడా మాకెంతో సాయం చేసింది. అయినప్పటికీ కరోనా తీవ్రత కార ణంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులు సరిపోవడం లేదు' అని ట్వీట్ చేశారు.