Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై వస్తున్న విమర్శలపై సీరం ఇన్స్టిట్యూట్ శనివారం స్పందించింది. భారత దేశంలోని వ్యాక్సిన్ ధరను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడటం సరికాదని తెలిపింది. కొన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీ కోసం ముందుగానే నిధులు సమకూర్చినందువల్ల ఆ దేశాల్లో వ్యాక్సిన్ ధర తక్కువగా ఉందని వివరించింది. భారత ప్రభుత్వంతో సహా అన్ని దేశాల ప్రభుత్వాల ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లకు సరఫరా చేస్తున్న కోవిషీల్డ్ ప్రారంభ ధర అతి తక్కువగానే నిర్ణయించినట్లు పేర్కొంది. సీరం ఇన్స్టిట్యూట్ శనివారం ఇచ్చిన ట్వీట్లో, తాము ఐదు దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల సరఫరాలో, ప్రాణ రక్షణలో ముందు వరుసలో ఉన్నట్టు తెలిపింది. తాము ప్రతి మానవ జీవితాన్ని గౌరవిస్తామని పేర్కొంది. ధరల విషయంలో ఏర్పడిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఓ స్టేట్మెంట్ను జత చేసింది.