Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉసురు తీస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ కారణంగా కరోనా రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించేందుకు త్వరిగతిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా కోసం ఇతర దేశాల సాయాన్ని భారత్ కోరుతోంది. ప్రాణవాయువు నిమిత్తం సింగపూర్‌తో చర్చించగా... సానుకూలంగా స్పందించిన ఆ ద్వీప దేశం ఆక్సిజన్ అందించేందుకు అంగీకారం తెలిపింది. సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయం నుంచి వైమానిక దళ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను ఇక్కడికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పంచుకుంది. ఇవి త్వరలోనే భారత్‌కు చేరుకుంటున్నాయని తెలిపింది. కాగా, ఇప్పటికే భారత్‌లోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా పలువురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.