Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 70 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,91,851 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర అధికారిక లెక్కల ప్రకారం ఒక్క శుక్రవారం రోజే 773 మరణించినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు 74,045 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక అక్కడ మరణాల రేటు 1.52 శాతంగా ఉంది. అలాగే 41,88,266 మంది ప్రజలు హౌం క్వారంటైన్లో ఉన్నారని, 29,378 మంది ప్రజలు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూనెలో గడచిన 24 గంటల్లో 9,863 కేసులు నమోదవ్వగా, కరోనాబారిన పడి 30 మంది మత్యువాతపడ్డారు. నాగపూర్లో 7,970 కేసులు నమోదై.. ముంబయి కేసుల్ని అధిగమించింది. ఇక దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 3.32 లక్షల కేసులు నమోదయి ఆందోళనకు గురిచేస్తోది.