Authorization
Mon Jan 19, 2015 06:51 pm
థానే : థానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రికి ఇద్దరు కరోనా రోగులు వచ్చారు. ఐసీయూ బెడ్లు కావాలంటే ఒక్కొక్కరు రూ. 1.5 లక్షల చొప్పున ఇవ్వాలని డాక్టర్ పర్వేజ్ అజిజ్ షేక్ డిమాండ్ చేశాడు. ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిరుధ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ పర్వేజ్ రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేసింది నిజమేనని తేలింది. ఈ క్రమంలో పోలీసులు డాక్టర్ పర్వేజ్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. పర్వేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.