Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేలో తీవ్ర స్థాయికి వైరస్
- ఎస్బీఐ రిపోర్ట్
ముంబయి : దేశంలో కరోనా వైరస్ ఉధతి పట్ల ప్రభుత్వ రంగంలోని ఎస్బీఐ ఓ పరిశోధనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లాక్డౌన్లకు బదులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే ప్రత్యామ్నాయమని సూచించింది. రికార్డు స్థాయిలో వైరస్ కేసులు నమోదవుతున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఒకవేళ దేశంలో మూడో వేవ్ వస్తే తట్టుకోవడం చాలా కష్టమని హెచ్చరించింది. ఇందుకు అమెరికా జపాన్ వంటి దేశాలలో మూడో దశ సృష్టించిన విలయాన్ని గుర్తు చేసింది. మే మూడవ వారానికి కరోనా దశ తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఎస్బీఐ అంచనా వేసింది. రోగనిరోధక శక్తిని, హర్డ్ ఇమ్యూనిటి సాధించేందుకు మొత్తం జనాభాకు టీకాలు అనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. అప్పుడు మాత్రమే ఇతర దేశాల మాదిరిగా వైరస్ను ఎదుర్కోగలమన్నారు.