Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పంచాయతీరాజ్ దివస్' ప్రసంగంలో మోడీ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విపత్తు గతేడాది కంటే ఈ సంవత్సరం భారత్కు పెనుసవాల్ విసురుతోందని, ఈ వైరస్ గ్రామాలపై విరుచుకుపడకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పంచా ఓయతీరాజ్ దివస్ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. స్వమిత్వ (ఎస్డబ్ల్యుఎఎంఐటివిఎ) పథకం కింద ఈ-ప్రాపర్టీ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. గతేడాది కరోనా వైరస్ గ్రామాలపై పెద్దగా ప్రభావం చూపకుండా ఆపారని, స్థానిక నాయకత్వానికి ఆ అనుభవం, జ్ఞానం ఉన్నందున గతేడాది విజయం పునరావృతం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వ నిబంధనలను గ్రామాలు పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యమ్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పంచాయత్ అవార్డుల ప్రదానం
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ 2021 జాతీయ పంచాయత్ అవార్డులను కూడా ప్రదానం చేశారు. 224 పంచాయతీలు-దీన్దయాల్ ఉపా ధ్యారు పంచాయత్ సశక్తికరణ్ పురస్కారం, 30 పంచాయతీలు-నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారం, 29 పంచాయతీలు-గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ అవార్డు, 30 పంచాయతీలు-చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ అవార్డు, అదేవిధంగా 12 రాష్ట్రాలకు ఈ-పంచాయత్ పురస్కారాలు వచ్చాయి. ఆయా పురస్కారాలకు సంబంధించి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అవార్డు నగదును మోడీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద బటన్ క్లిక్ చేసి బదిలీ చేశారు.