Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు ఆక్సిజన్ కొరతతో రాష్ట్రాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే వారు ఎంతటివారైనా సరే.. ఉరితీస్తామని హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురవుతున్న కోవిడ్ రోగులకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ.. బెంగళూరు మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా 'ఆక్సిజన్ సరఫరా తరలింపును అడ్డుకున్న వ్యక్తిని ఉరితీస్తాం అంటూ.. జస్టిస్ విపిన్సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. అలాగే ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకుంటే ఆ సంఘటనలను కేంద్రం దష్టికి తీసుకురావాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకునేలా.. వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.