Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 48వ సీజేఐగా బాధ్యతలు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యామూర్తి (సీజేఐ)గా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ) ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. రమణతో ప్రమాణస్వీకారం చేయిం చారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.ఏ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసిన విషయం విదితమే. దీంతో ఆయన స్థానంలో ఎన్వీ రమణ నియమితులయ్యారు. వచ్చే ఏడాది ఆగష్టు 26 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. దేశ అత్యున్నత న్యాయస్థానం పీఠం అధిష్టించిన రెండో వ్యక్తిగా రమణ చరిత్ర సృష్టించారు. 1966-67 మధ్య కాలంలోతొలిసారి తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐ గా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగష్టు 27న ఎన్వీ రమణ జన్మించారు. 2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఎంపికయ్యారు. అలాగే, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదోన్నతి పొందారు.