Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మోహన్ ఎం శాంతన్గౌడర్ (62) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గుర్గావ్లోని మేదాంత ప్రయివేటు ఆస్సత్రిలో చేరిన ఆయన.. శనివారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.శాంతన్గౌడర్ 1958, మే 5న కర్ణాటకలో జన్మించారు. అడ్వకేట్‌గా 1980, సెప్టెంబర్ 5న పేరు నమోదు చేసుకున్నారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు 2003లో కర్నాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2004లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా పదోన్నతి లభించింది.
అనంతరం ఆయన కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2016లో యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. అదే సంవత్సరంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరించింది. అనంతరం సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది.