Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా ఉధృత రూపం దాల్చడంతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్, బెడ్స్ వంటి వైద్య సదుపాయాలు కొరత ఏర్పడింది. పలు ఆస్సత్రుల్లో మత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఈ ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో కోవిడ్ -19 రోగుల చికిత్స నిమిత్తం ఎంపి ల్యాండ్ నుంచి 1.17 కోట్లను మంజూరు చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. ఎంపి నిధుల నుంచి ఈ సొమ్మును తీసుకుని, కోవిడ్-19 మహమ్మారి బాధితుల చికిత్స నిమిత్తం వినియోగించాలని కోరారు. కోవిడ్ ప్రోటోకాల్స్, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.