Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: ఒక జంట కరోనా వార్డులో పెండ్లి చేసుకున్నది. కేరళలోని అలప్పుజ వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామికి ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. విదేశాల్లో ఉద్యోగం చేసే శరత్ కేరళకు వచ్చి పెండ్లి పనుల్లో ఉండగా కరోనా సోకింది. ఆయన తల్లి కూడా కరోనా బారిన పడటంతో వారిద్దరు అలప్పుజ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కరోనా వార్డులో ఉన్నారు. మరోవైపు ముందుగా నిర్ణయించిన ఈ నెల 25న శరత్, అభిరామికి పెండ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో కరోనా వార్డులో పెండ్లి కోసం జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందారు. దీంతో ఆదివారం వధువు అభిరామి, మరో బంధువు పీపీఈ కిట్ ధరించి కరోనా వార్డులోకి ప్రవేశించారు. వరుడు శరత్ తల్లి దండలు అందించగా వారిద్దరు మార్చుకున్నారు.